సతీసహగమనం కుటుంబ ఆచారంమటే చట్టం ఒప్పుకుంటుందా?

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. అశోక్ కత్తి అందించాడు..విజయసాయిరెడ్డి

అమరావతి: వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విమర్శలు గుప్పించారు. ఈరోజు ఉదయం విజయసాయి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే… కత్తి అందించి ఖతం చేశాడు అశోక్ గజపతి అని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ నుంచి ఎన్టీఆర్ గెంటేసిన వారిలో మొదటి పేరు బాబుదైతే, రెండో పేరు అశోక్ దని చెప్పారు.

వరకట్నం, సతీసహగమనం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? అని విజయసాయి ప్రశ్నించారు. స్త్రీలకు ఆస్తిహక్కును ఇవ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోను లేదంటే చెల్లుతుందా అశోక్? అని ప్రశ్నించారు. ప్యామిలీ లా అయినా, బై లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యంగం నిర్దేశించిందని చెప్పారు. రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతాయని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/