టిడిపిపై విజయసాయిరెడ్డి సెటైర్లు

కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి వైఎస్‌ఆర్‌సిపిల మధ్య మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మధ్య మాటల యుద్ధం జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా టిడిపిపై విమర్శలు గుప్పించారు. ‘కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని’ అంటూ సెటైర్లు వేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/