చంద్రబాబు ఆర్డరేస్తేనే పవన్‌కళ్యాణ్ ఢిల్లికి వెళ్తున్నారు
రాష్ట్రంలో బిజెపి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ముందుగా పవన్ కళ్యాణ్‌ను పంపిస్తున్నారు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వైఎస్సాఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. యాజమాని చంద్రబాబు నాయుడు ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ పవన్‌కళ్యాణ్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా పావలా పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఢిల్లీకి పంపిస్తున్నాడని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది చంద్రబాబు ఎత్తుగడ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/