బిజెపి గెలిస్తే టిడిపి గెలిచినట్లు మురిసిపోతున్నారు

ఇంకొకరి గెలుపుతో పండుగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు .. విజయసాయిరెడ్డి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్‌ఆర్‌సిపి నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపి నేత రఘునందన్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ పోటీ చేయడానికి టిడి అభ్యర్థి దొరకలేదని ఆయన ఆరోపించారు. ‘తండ్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శికి దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బిజెపి గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్టు మురిసి పోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్ల వింత ఇది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/