చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

ఓటుకు నోటు కేసులో ఫోనులో చంద్ర‌బాబు భాష‌.. ఇప్పుడు అచ్చెన్న భాష ఒకేలా ఉన్నాయి.. విజ‌య‌సాయిరెడ్డి

అమరావతి: ఏపిలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల్లో టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి వైఎస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థిగా కింజరపు అప్పన్నను బరిలో నిలవడం ఇటీవ‌ల‌ ఉద్రిక్తతలకు దారితీసిన విష‌యం తెలిసిందే. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి ఆపే ప్రయత్నం చేశారని జ‌రుగుతోన్న ప్ర‌చారంపై స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌తో ‘ఫర్ ఎవ్రీథింగ్, ఐయామ్ విత్ యూ’ అని చంద్రబాబు మాయ చేయడం, నిమ్మాడలో నామినేషన్ వేయొద్దని అప్పన్నకు చేసిన ఫోన్‌ కాల్‌లో అచ్చెన్న వాడిన భాష ఒకేలా ఉన్నాయి. ‘నీకు అన్యాయం జరిగింది. ఇకపై బాగా చూసుకుంటా’ అంటున్నాడు. ఎంతైనా బాబు ట్రెయినింగ్ కదా!’ అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/