మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నారు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిపాలైన టిడిపి గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబుకు చురకలంటించారు. తిరుపతి లోక్‌సభ స్థానంపై చంద్రబాబు నాయుడు ఇంకా ఆశలు పెట్టుకున్నారని, ప్రజలు వైఎస్‌ఆర్‌సిపి కి దూరమయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో ‘ఇరగదీసిన’ తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు? ఆ సరదా కూడా తీర్చుకుందురు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/