ప‌వ‌న్ అఫిడ‌విట్‌పై విజ‌య‌సాయి ట్వీట్‌

pawan kalyan
pawan kalyan


అమ‌రావ‌తిః జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల అధికారికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌పై వైఎస్ఆర్‌సిపి నేత విజ‌య్ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. రూ.52 కోట్ల ఆస్తులున్నట్టు 32 కోట్లు అప్పులున్న‌ట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపిన వ్యక్తి ఈత చాపపై కూర్చుని మట్టి పిడతలో అన్నం తినడం డ్రామా కాక మరేమవుతుంద‌ని అన్నారు. 30-40 ఏళ్ల కింద ఇటువంటి వేషాలు వేస్తే జనాలు నమ్మేవారేమో కాని ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. మహాత్మా గాంధీ అంత సాధారణ వ్యక్తినని షో చేస్తే ప్రజలు పగలబడి నవ్వుతార‌న్నారు.