దానిపై కనీసం నోరు కూడా మెదపలేదెందుకు?

స్వర్ణ ప్యాలేస్ ప్రమాదంలో 10 మంది మృతి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం దగ్ధమైన విష‌యం తెలిసిందే. అయితే ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి‌, ఇందులో స‌భ్యులుగా నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావును చేర్చిన విష‌యం తెలిసిందే. వీరు అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక అందిస్తారు. అయితే, దీనిపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘అంత‌ర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకనని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు’ అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/