టిడిపి నేతలకు విజయసాయిరెడ్డి కౌంటర్‌

ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు చంద్రబాబు ఫీలవుతున్నాడు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడడంపై టిడిపి తలు చేస్తోన్న వ్యాఖ్యల పై విమర్శలకు దిగారు.’పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!’ అని ఎద్దేవా చేశారు. ‘స్థానిక ఎన్నికలను వాయిదా వేయించి గెలిచినట్టు ఫీలవుతున్నాడు చంద్రబాబు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ. నాయకులు పార్టీ వీడిపోతుంటే ఈ దిక్కుమాలిన పనికి ఒడిగట్టావు. నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు’ అని ట్వీట్ చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/