పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతికి విలువలుంటాయి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి పొత్తులపై విమర్శలు గుప్పించారు. విలువలు లేకుండా టిడిపి ప్రవర్తిస్తోందని ట్వీట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా టిడిపి కి లేదని అభిప్రాయపడ్డారు. ‘పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయి. బిజెపి తో అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్దుబాటు చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అభ్యర్థులు లేని చోటల్లా జనసేనకు వదిలేశామని చెప్పుకుంటున్నారట. ఒక్క మండలమైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం’ అని విమర్శించారు. ‘ఎలక్షన్లలో అక్రమాలు, అరాచకాల గురించి చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా? మా పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను లాక్కుంది ఎవరు? గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడు బురద చల్లుతున్నావు’ అని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/