ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన విజయశంకర్!

లండన్: ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్ విజయశంకర్ తప్పుకున్నాడని బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐతో పేర్కొన్నారు. ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తుండగా విజయశంకర్ కాలికి గాయమైంది. దీంతో అతడు ప్రపంచకప్‌లో కొనసాగడం కష్టంగా ఉందని, స్వదేశానికి తిరిగొస్తాడని అధికారి తెలిపారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేసిందని అన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా హీరోయిన్ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/