చిరంజీవి కి విలన్ గా విజయ్ సేతుపతి..

ఆచార్య తో భారీ ప్లాప్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి ..తదుపరి చిత్రాల జాగ్రత్తపడుతున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ ఫై మూడు సినిమాలు ఉండగా..వాటిలో ఒకటి తన 154 ఒకటి. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ చిత్రంలో చిరంజీవి కి విలన్ గా ఎవరు నటిస్తారనే సందేహం గత కొద్దీ రోజులుగా అందరిలో మేలుగుతోంది. కాగా ఈ సందేహాలకు చిత్ర యూనిట్ చెక్ పెట్టినట్లు సినీవర్గాల నుంచి ఓ సమాధానం అందుతోంది.

పవర్​ఫుల్​ విలన్​గా విజయ్​సేతుపతి నటించనున్నారనే వార్త ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంటర్వెల్​లో ఈ పాత్ర రివీల్​ అవుతుందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముందని చెపుతున్నారు. కాగా, విజయ్​ సేతుపతి గతంలో ‘సైరా’ చిరంజీవికి అనుచరుడిగా నటించారు. మాస్‌ కథాంశంతో బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా… ప్రేక్షకులకు వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ తో పాటు చిరంజీవి గాడ్ ఫాదర్ , భోళాశంకర్ చిత్రాలు చేస్తున్నారు.

వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని మాస్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి లుక్స్‌నుబట్టి ఆయన మత్య్సకారుడిగా నటిస్తారని తెలుస్తోంది. ఇక చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.