పులి పిల్లలను దత్తత తీసుకున్న విజయ్‌ సేతుపతి

vijay sethupathi
vijay sethupathi, tamil actor


చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి జంతువుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. చెన్నైలోని వాండళూరు ప్రాంతంలో ఉన్న అరిగ్నర్‌ అన్నా జంతు ప్రదర్శన శాలను విజయ్‌ సందర్శించారు. అక్కడ నుంచి రెండు తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకున్నాడు. జూ అధికారులు పెంచుతున్న రెండు తెల్ల పులి పిల్లలను దత్తత తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణకు రూ. 5 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఇక్కడున్న జంతువుల్లో చాలా మటుకు మనకు అడవుల్లో కనిపించవు. అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న మన దేశ సంపదలో భాగమైన జంతువులను కాపాడుకుందాం అని అందరూ వచ్చి వీక్షించి ఎవరికి ఎంత తోస్తే అంత విరాళంగా ఇవ్వాలని కోరారు. 2009లో యానిమల్‌ అడాప్షన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. జంతువులను దత్తత తీసుకోవాలని అనుకునేవారు జూ అధికారులకే నగదు చెల్లించి వాటి ఆలనా పాలనా చూసుకోవచ్చు. గతంలో తమిళ నటుడు శివకార్తికేయన్‌ కూడా ఓ పులిని దత్తత తీసుకున్నారు.