ఇకపై సాధారణ జీవితం గడుపుతాను

విలాసవంతమైన జీవితానికి స్వస్తి
ఖర్చు తగ్గించి బకాయిలకు జమ
కోర్టులో మాల్యా వెల్లడి

vijay mallya
vijay mallya

లండన్‌: కింగ్‌ ఫిషర్‌ యజమాని విజ§్‌ు మాల్యా తాను విలాస జీవితానికి దూరంగా ఉంటానని బ్రిటన్‌ హైకోర్టులో వెల్లడించారు. ఆయనకు సంబంధించిన ఎయిర్‌లైన్స్‌ నష్టాల పాలై మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినా, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి కూడా ఆయన విలాస జీవితానికి దూరంగా ఉండలేదు. ఇప్పటికీ లండన్‌లో కూడా ఆయన ఠీవి ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఐతే ఇప్పట్నించి విలాస జీవితానికి దూరంగా ఉంటానని , ఖర్చులు తగ్గించుకుంటే ఆ మిగులు డబ్బులు భారత్‌కు చెందిన వివిధ బ్యాంకుల బకాయిలు చెల్లింపునకు ఉపయోగపడతాయని బ్రిటన్‌ హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా ఆయన వెల్లడించారు. సాధారణ జీవితం గడిపేందుకు వారంలో 18325 పౌండ్లు(దాదాపు రూ.16,00,000) వరకు వెచ్చించేందుకు మాల్యాకు అనుమతి ఉంది. దీనిని నెలకు 29500 పౌండ్లు( దాదాపు రూ.25,00,000) పరిమితం చేసుకునేందుకు ఆయన ఒప్పుకున్నాడు. ఐతే మాల్యా చెప్పిన అంశాన్ని ఎస్‌బిఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల బృందం తిరస్కరించింది. లండన్‌లోని ఐసిఐసిఐ బ్యాంకులోని ఖాతాలో 2,60,00 పౌండ్లను బకాయిల కింద జమ కట్టేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరాయి. రుణసంస్థలకు పూర్తిగా బకాయిలు చెల్లించేందుకు, భారత్‌లో కోర్టు విచారణ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని పలుమార్లు చెబుతూ వస్తున్న విషయాన్ని కూడా మాల్యా న్యాయవాది ప్రస్తావించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/