మాల్యాను భారత్‌కు అప్పగించనున్న బ్రిటన్

విజయ్ మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ పూర్తి

vijay mallya
vijay mallya

న్యూఢిల్లీ: విజయ్ మాల్యాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఈరోజు వెల్లడించాయి. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్‌కు తరలించవచ్చు అని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు వెల్లడించారు. విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం అని ఆయన పేర్కొన్నారు. ఐతే ఎప్పుడు తరలిస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/