విజయ్ దేవరకొండ హెల్త్ అప్డేట్..

, vijay deverakonda Health Update

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆరోగ్యం ఫై అంత రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం ఫై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలిపాడు. విజయ్ కు ఎనిమిది నెలల కిందట భుజం గాయం అయింది. నొప్పితోనే ‘లైగర్’ షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. చికిత్స తర్వాత ఎట్టకేలకు ఈ సమస్య నుంచి పూర్తిగా బయట పడ్డట్టు విజయ్ చెప్పాడు. ఈ మేరకు చేతులు చూపిస్తూ ఓ ఫొటోను షేర్ చేశాడు. 8 నెలల రిహాబిలేషన్ (చికిత్స) తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని అందులో రాశాడు. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ తన ఇన్స్టా గ్రామ్ స్టోరీలో తెలిపాడు.

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. రీసెంట్ గా పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ చేసారు విజయ్. ఈ మూవీ పాన్ ఇండియా గా భారీ ఎత్తున విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ తో అభిమానులంతా ఖుషి మూవీ ఫైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సమంత హీరోయిన్.