విజయ్ దేవరకొండ ను నత్తితో చూడాలి..

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. ఈ నెల 25 న పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు పలు భాషల్లో విడుదల కాబోతుంది. సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడం తో చిత్ర విశేషాలు బయటకు వస్తూ ఆసక్తి పెంచేస్తున్నాయి. కాగా ఈ మూవీ లో విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడతాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు.

లైగర్ చిత్ర బృందం శనివారం చెన్నైలో సందడి చేసింది. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నటుడు విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించి కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర నత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రను చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నాడు.

సినిమా షూటింగ్ సందర్భంగా మైక్ టైసన్ చెంపపై కొట్టిన దెబ్బకు ఒక రోజంతా నొప్పితో బాధపడినట్టు విజయ్ దేవరకొండ చెప్పాడు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందినట్టు తెలిపాడు. రమ్యకృష్ణ గొప్పగా నటించినట్టు పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయగా..బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి నిర్మించారు.