వీడీ 11 సెట్ లో విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుక

16న ఫస్ట్ లుక్ విడుదల

VD BIRTHDAY IMAGE FINAL
VD BIRTHDAY IMAGE FINAL

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను వీడీ 11 మూవీ సెట్ లో జరుపుకున్నారు. చిత్ర బృందం సమక్షంలో విజయ్ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. యూనిట్ అంతా ఆయనకు విశెస్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా 16 రోజుల కాశ్మీర్ షూట్ గ్లింప్స్ వీడియో తో చిత్ర యూనిట్ మరో ప్రకటన చేశారు. సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటోంది. తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/