శ్రీలంకలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా ‘#VD12’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ చిత్రీకరణ కోసం ఇటీవలె విజయ్ దేవరకొండ శ్రీలంక వెళ్లారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

ఈ సినిమా షూట్‌ కోసం విజయ్‌ దేవరకొండ టీం శ్రీలంకలో 45 రోజులపాటు ఉండనుందట. ఈ షెడ్యూల్‌లో విజయ్‌ దేవరకొండతోపాటు ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాప్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం శ్రీలంకలో ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తు్న్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.