మహేష్ థియేటర్ లో విజయ్ దేవరకొండ ఏ సినిమా చూశాడో తెలుసా..?

వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ ..షూటింగ్ లో కాస్త టైం దొరకడంతో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్ లో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ న‌టించిన Top Gun: Maverick సినిమాను వీక్షించాడు. ఆ టైంలో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఫోటో లో సింపుల్ అవుట్‌ఫిట్‌లో విజ‌య్‌ కనిపిస్తుండడం తో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్.. పూరీ జ‌గ‌న్నాథ్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టు లైగ‌ర్‌ తో త్వ‌ర‌లో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా విడుద‌ల కాకముందే పూరీతో మ‌రో ప్రాజెక్టు జ‌న‌గ‌ణ‌మ‌న కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు శివ‌నిర్వాణ డైరెక్ష‌న్‌లో స‌మంత‌తో కలిసి ఖుషి సినిమాలో న‌టిస్తున్నాడు.