ఖుషి స్థాయిలో మా ఖుషి ఉంటుందంటున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 25 న పాన్ ఇండియా గా తెలుగు తో పాటు పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న విజయ్ ను మీడియా వారు తాను నటిస్తున్న ఖుషి మూవీ గురించి పలు ప్రశ్నలు అడిగారు. దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖుషి మూవీ టైటిల్ తో విజయ్ సినిమా చేస్తుండడం తో అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గదని విజయ్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి స్థాయిలో మా ఖుషి సినిమా కూడా ఉంటుందని అన్నాడు. ఏమాత్రం అనుమానం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జనరేషన్ మొత్తానికి కూడా ఖుషి సినిమా ఒక అద్భుతం. అలాంటి సినిమా యొక్క టైటిల్ ను మా సినిమాకు పెట్టి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. మా ఖుషి సినిమా చూసిన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్విస్తారు. మరో మంచి ఖుషి సినిమా ను చూశాం అంటూ వారు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు అన్నట్లుగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.