విజయ్ కటౌట్ ఫై ట్రోల్స్..కట్‌ డ్రాయర్‌ యాడ్‌లా ఉంది

విజయ్ దేవరకొండ కటౌట్ ఫై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ రేపు ఉదయం విడుదల కాబోతుంది. ఈ తరుణం లో హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో విజయ్ దేవరకొండకు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఏకంగా 75 ఫీట్ల కటౌట్ ను ఏర్పటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కటౌట్‌లో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌ అవతారంలో అర్థనగ్నంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ కటౌట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అది కటౌట్‌లా లేదని.. కట్‌ డ్రాయర్‌ యాడ్‌లో ఉందని అంటున్నారు. మరికొంతమంది ఈ కటౌట్‌ని ఎడిట్‌ చేసి విజయ్‌ ఫోటోకి పంచె, బనియన్‌ తొడిగించి, నెత్తిన ఓ తలపాగ పెట్టి ‘సౌత్‌ఇండియా లైగర్‌’అంటూ ఆ ఫోటోని వైరల్‌ చేస్తున్నారు. మొత్తం మీద విజయ్ కటౌట్ రకరకాలుగా చక్కర్లు కొడుతుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.