బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ఆరోగ్యం విషమంగా ఉందా..?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ఆరోగ్యం విషమంగా ఉందా..? ప్రస్తుతం అభిమానులను , సినీ ప్రేక్షకులను ఈ వార్త ఖంగారు పెట్టిస్తుంది. బిచ్చగాడు మూవీ తో తెలుగు ఆడియన్స్ ను అలరించిన విజయ్..ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బిచ్చగాడు మూవీ లెవల్లో అలరించలేకపోయారు. ప్రస్తుతం బిచ్చగాడు మూవీ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మలేసియా లో జరుగుతుంది. ఈ షూటింగ్ జరుగుతుండగా అయన ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాదానికి గురైన వెంటనే చిత్ర యూనిట్ హుటాహుటిన మలేషియాలోని ఓ హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోట్ లో ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. వేగంగా ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి పడవని ఢీ కొట్టిందట. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. కాగా ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న విజయ్ ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలు అభిమానులను ఖంగారుకు గురి చేస్తుంది. విజయ్ భార్య ఫాతిమా విజయ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినట్లు కోలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కింద పడినప్పుడు విజయ్ పళ్ళు, దవడ ఎముక విరిగినట్లు.. ముఖానికి కూడా గాయాలైనట్లు సమాచారం.

బుధవారం సాయంత్రం మలేషియా నుండి విజయ్ ఆంటోనీని చెన్నైకి తీసుకొచ్చారు. అయితే ఒకవైపు విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు ఇప్పుడే చెప్పలేమంటున్నారని వార్తలు వస్తున్నప్పటికీ.. ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు మాత్రం మరోలా చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం అని వస్తున్న వార్తలు అవాస్తవమని బుధవారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఈయన సినిమా పనులు చూసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. అంతేకాదు నడుముకు మాత్రమే చిన్న గాయం తగిలిందని.. ప్రస్తుతం ఆయన సినిమా పనులు చూసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.