అగ్రిటెక్‌ సౌత్‌-2020 ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు

YouTube video

There is a need to promote climate-smart agriculture, says Vice President

హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సు జరుగుతుంది. మూడు రోజుల పాటు ఈ సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమయానుకూలంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఉపయోగించుకోవాలని సూచించారు. విస్తృతమైన మార్కెట్, గోదాముల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, కల్తీలేని మందులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/