బీహార్‌లో హైవే ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi launches ‘Ghar Tak Fibre’ Scheme and lays foundation stone for 9 highway projects in Bihar.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి బీహార్‌లో హైవే ప్రాజెక్టులు, ఇంటింటికి ఫైబర్ స్కీమ్‌ను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశంలోని గ్రామాలు స్వావలంబన చెందుతున్నాయని, బీహార్ నుంచి ఇది మొదలు కావడం గర్వకారణమని ఆయన అన్నారు. మౌళిక సదుపాయాలపై దృష్టిసారించిన దేశాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నాడు వాజ్‌పేయి ప్రభుత్వం తర్వాత ప్రస్తుతం తమ ప్రభుత్వమే ఈ ప్రాముఖ్యతను గుర్తించి ఆ మేరకు చర్యలు చేపడుతున్నదని మోడి తెలిపారు. కాగా బీహార్‌లో ప్రధాని ప్రారంభించిన హైవే ప్రాజెక్టులో భాగంగా రూ.14,258 కోట్ల నిధులతో 350 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. ఇంటింటికి ఫైబర్ పథకం కింద ఆ రాష్ట్రంలోని 45,945 గ్రామాలను అనుసంధానం చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/