De De Pyaar de.. రకుల్ రచ్చ

క్రషింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో జెండా పాతేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉంది. అజయ్ దేవగన్ తో నటించిన దే దే ప్యార్ దే విడుదలయ్యాక తన ఫేట్ మారిపోతుందని చాలా నమ్మకంతో ఉంది రకుల్. గత నెలలో వచ్చిన ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే ఉండటంతో ఆశలు జోరుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలకమైన పాట తాలూకు వీడియో సాంగ్ ని నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. వడ్డీ షరాబన్ అంటూ సాగే ఈ పాటలో ఉన్న ఒకే ఒక్క ప్రత్యేకత రకుల్ గ్లామర్. బ్యాక్ లెస్ కాస్ట్యూమ్ తో ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని నడుముని ఫుల్ గా ఎక్స్ పోజ్ చేస్తూ రకుల్ చేసే డాన్స్ తప్ప పాటలో ఇంకేమి కనిపించదు

అలా అని ఇదేదో మై నేమ్ ఈజీ షీలా టైపులో వైరల్ అయ్యే రేంజ్ లో లేదు కానీ రకుల్ ని ఇంతకు ముందు ఎన్నడూ ఈ అవతారంలో చూడలేదు కాబట్టి కొత్తగానే అనిపిస్తుంది. అంతే కాదు మందు కొట్టి రకుల్ చిందులేయడం ఒక ఎత్తు అయితే ఆ మందుని చుట్టూ ఉన్న వాళ్ళు తన నడుము మీద చిమ్మడం రచ్చ మాములుగా లేదు.

యాభై ఏళ్ళ వయసుకు వచ్చి టీనేజ్ పిల్లలున్న హీరో ప్రేమలో పడే యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ కాస్త రిస్క్ ఉన్న పాత్రనే చేస్తోంది. అందరూ కుర్ర స్టార్ల వెంటపడుతుంటే రకుల్ మాత్రం అజయ్ దేవగన్ నాగార్జున అంటూ హాఫ్ సెంచరీ హీరోలతో జట్టు కడుతోంది. టైం కలిసిరానప్పుడు తప్పదు మరి. అన్నట్టు ఈ వడ్డీ షరాబీ పాటలో రకుల్ డాన్స్ తప్ప అజయ్ తనతో కాలు కదపడం లాంటివి ఏమి లేవు. అంత మందు కొట్టి రకుల్ చిందులేస్తుంటే ఇంకేదైనా ఎందుకు అవసరం పడుతుంది.