కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి వీడియో సమావేశం

కరోనా నివారణ చర్యలపై దిశా నిర్దేశం

Union Cabinet Secretary Rajiv Gouba

New Delhi: దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియో సమావేశం నిర్వహించనున్నారు.

ఆదివారం ఢిల్లి నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రతపై చర్చించనున్నారు.

దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 96 జిల్లాల పాలనా యంత్రాంగాలతో, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశంలో మాట్లాడనున్నారు.

ఈ సందర్భంగా కొవిడ్‌- 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్మెంట్‌ విధానంపై ఆయన ఓరియంటేషన్‌ కమ్‌ ట్రైనింగ్‌ సెషన్‌ను నిర్వహించనున్నారు.

మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు అధికంగా నమోదైన 7 జిల్లాల పాలనా యంత్రాంగాలు ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.

విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులు సమావేశంలో పాల్గొని, పరిస్థితులను వివరించనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/