జగన్‌ని ప్రశంసించిన నవీన్‌ పట్నాయక్‌

సిఎం జగన్‌, సిఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ల మధ్య వీడియో కాన్ఫరెన్స్

Odisha CM today talks to AP CM Jagan

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఏపిలో చిక్కుకుపోయిన ఒడిశాకు చెందిన వలస కార్మికులు, కూలీల తరలింపు నేపథ్యంలో ఏపి సిఎం జగన్‌, ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌ మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.


ఈసందర్భంగా ఒడిశా సిఎం మాట్లాడుతూ.. జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఉన్న ఒడిశా ప్రజలకు మంచి వసతి, భోజన సదుపాయాలను అందించారని అన్నారు. తమ రాష్ట్రానికి తిరిగి వస్తున్న వారికి అవసరమైన రవాణా సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. కరోనా వల్ల తలెత్తిన క్లిష్ట సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని ప్రశంసించారు.


ఏపి సిఎం జగన్‌ మాట్లాడుతూ..మాట్లాడుతూ, దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు తమ రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిలో దాదాపు 1900 మంది ఒడిశాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని… వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మిగిలిన వారిలో సొంత రాష్ట్రానికి ఎవరు వెళ్లాలనుకున్నా… వారికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు అని కొనియాడారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో ఒడిశా కూలీలను బాగా చూసుకుంటున్నారని ప్రశంసించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/