నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రాక

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సిపి వెల్లడి

Venkaiah Naidu
Venkaiah Naidu

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఆయన నగరంలో పర్యటించే సమయంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.40కి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి హబ్సిగూడలోని సీసీఎంబీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4.15 జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి బయలుదేరుతారనీ.. ఆ సమయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని అదనపు సీపీ వివరించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/