పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సీతా అశోక మొక్క‌ను నాటిన ఉప‌రాష్ట్రప‌తి

నేడే ఉప‌రాష్ట్రప‌తిగా దిగిపోనున్న వెంక‌య్య‌

vice-president-venkaiah-naidu-plants-sita-ashoka-sappling-in-parliament-premises

న్యూఢిల్లీః ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌నున్నారు. వెంక‌య్య స్థానంలో కొత్త ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ఢ్ గురువారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ఈ క్ర‌మంలో బుధ‌వారం వెంక‌య్య‌నాయుడు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సీతా అశోక మొక్క‌ను నాటారు. భారతీయ సంప్రదాయంలో చెట్ల ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు. ఒక్క చెట్టు.. అనేక మంది పుత్రులకు సమానమన్న పురాణ పురుషుల వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. భార‌తీయ సంస్కృతిలో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సీతా అశోక మొక్కకు ఔష‌ధ గుణాలున్న చెట్టుగానూ గుర్తింపు ఉంది. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వి నుంచి దిగిపోతున్న నేప‌థ్యంలోనే వెంక‌య్య అరుదైన ఈ మొక్క‌ను పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నాటారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/