యోగా చేయ‌డం అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..ఉప రాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిక్రిందాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. యోగా చేయ‌డం అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం అన్నారు. ప్ర‌తి రోజు యోగా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి జ‌బ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చ‌ని, యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు.

యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారని, ఏ స్థాయిలో ఉన్నా యోగా తప్పనిసరి సాధన చేయాలన్నారు. ప్రపంచ శాంతిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని, యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/