సాహితీలోకంలో సినారెది ప్రత్యేక స్థానం : ఉపరాష్ట్రపతి

నేడు సి.నారాయణరెడ్డి జయంతి

న్యూఢిల్లీ : ఆధునిక తరం కవి, సుప్రసిద్ధ సినీ గీత రచయిత సి.నారాయణరెడ్డి (సినారె) జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సినారెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారే సుసంపన్నం చేశారని కొనియాడారు.

అదే సమయంలో సినీ సాహిత్యానికి గౌరవం తెచ్చిపెట్టారని, సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తుంచుకుంటుందని కీర్తించారు. సాహితీలోకంలో సినారెది ప్రత్యేక స్థానం అని, ఆయన నుంచి వచ్చిన రచనలు పాత తరానికి, కొత్త తరానికి మధ్య వారధిలా నిలిచాయని వివరించారు. తెలుగు కవుల్లో తాను సినారెను ఎంతో అభిమానిస్తానని వెంకయ్యనాయుడు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/