ఆస్పత్రి నుంచి ఎల్​కే అడ్వాణీ డిశ్చార్జ్‌

బిజెపి అగ్రనేత ఎల్‌ కే అడ్వాణీ (96) ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యంగానే ఉండడం తో డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నాయి. వయో సంబంధిత సమస్యలతో అడ్వాణీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని పరీక్షల అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపాయి. ఆదివారం రాత్రి అడ్వాణీ అస్వస్థతకు గురవ్వగా, చికిత్స కోసం ఎయిమ్స్​లో ఆయన​ కుటుంబసభ్యులు చేర్పించారు.