చిత్రసీమలో మరో విషాదం : ‘ఆకాశం నీ హ‌ద్దురా’ నటుడు కన్నుమూత..

చిత్రసీమలో వరుస మరణాలు సినీ ప్రముఖులను , అభిమానులను , ప్రేక్షకులను శోకసంద్రంలో పడేస్తున్నాయి. ప్రతి రోజు ఏదొక ఇండస్ట్రీ లో ఎవరొకరు పలు కారణాలతో మరణిస్తున్నారు. నిన్న సోమవారం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ నటుడు రామురోజ్ క‌న్నుమూశాడు. శుక్ర‌వారం ఆయనకు గుండెపోటు రావ‌డంతో వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసారు. అప్ప‌టి నుండి చికిత్స పొందుతూ వస్తున్న రామురోజ్ సోమ‌వారం తుదిశ్వాస విడిచాడు. 2008లో వ‌చ్చిన ‘పూ’ సినిమాతో ఈయ‌నకు మంచి క్రేజ్ వ‌చ్చింది. దాంతో ఇండ‌స్ట్రీలో ఈయ‌న‌ను ‘పూ’ రాము అంటూ పిలుస్తున్నారు. ‘నీర్‌ప‌రవై’, ‘ప‌రియేరుమ్ పెరుమాల్’, ‘నీడునాల్‌వాడై’, ‘సూరరై పొట్రూ’ వంటి సినిమాలో కోలీవుడ్‌లో మంచి న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సూర్య హీరో గా నటించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. సూర్య తండ్రిగా ఈ మూవీ లో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు సినిమాల‌కు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈయ‌న మ‌ర‌ణ‌వార్త విన్న సీ.ఎం స్టాలిన్.. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతూ స్ట్రీట్ అర్టిస్టు నుండి గొప్ప న‌టుడిగా ఎదికి రామురోజ్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు అంటూ వెల్ల‌డించాడు. ఉద‌యనిధి స్టాలిన్ హాస్పిట‌ల్‌కు వెళ్ళి నివాళులు అర్పించాడు. రాము అంత్య‌క్రియ‌లు ఉర‌ప‌క్కంలోని త‌న నివాసంలో మంగ‌ళ‌వారం జ‌రుగ‌నున్నాయి. కోలీవుడ్ సినీ ప్రముఖులంతా రామురోజ్ కు సంతాపం తెలియజేస్తున్నారు.