ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల కన్నుమూత

vijaya nirmala
vijaya nirmala


హైదరాబాద్‌: ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. బుధవారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విజయనిర్మల పార్ధివ దేహాన్ని కాసేపట్లో ఆసుపత్రి నుంచి స్వగృహానికి తరలించనున్నారు. ఇవాళ అభిమానుల సందర్శనార్ధం ఇంట్లోనే ఉంచి రేపు ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలిస్తారు. విజయనిర్మల భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: