ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నా

నన్ను ఉగ్రవాది అనడం విచారకరం: కేజ్రీవాల్‌

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ హస్తినలో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల కొందరు రాజకీయ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ వివాదస్పద వ్యాఖ్యలకు తెరతీస్తున్నారు. బిజెపి ఎంపీపర్వేశ్‌ వర్మ తనను ఉగ్రవాది సంబోధించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ప్రజలకు సహాయం చేసేందుకు తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొనట్లు కేజ్రీవాల్‌ చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఢిల్లీ ప్రజల కోసం అన్ని వదులుకున్నాని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక కష్టాలు పడ్డాను. కానీ ఈ రోజు బిజెపి నన్ను ఉగ్రవాది అంటుందని ఇది చాలా విచారకరం అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/