వెంకయ్యనాయుడు ఉపన్యాసం కోసం ఎదురు చూసేవాడిని
ఏవీవీ పాఠాశాలలో ఆరు నుంచి పది వరకు చదువుకున్నాను

వరంగల్: వరంగల్ జిల్లాలోని ఏవీవీ కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. తాను చదువుకునేటప్పుడు వెంకయ్య ఉపన్యాసం కోసం ఎదురు చూసేవాడినని చెప్పుకొచ్చారు. నేను ఏవీవీ పాఠశాలలో ఆరు నుంచి పది వరకు చదువుకున్నాను అని తెలిపారు. వరంగల్ గాంధీ ఏవీవీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చందా కాంతయ్యకు నాకు చదువు అబ్బలేదు కానీ…క్రమశిక్షణ మాత్రం ఇక్కడ నేర్చుకున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవీవీ విద్యాసంస్థలను ఆదుకోవాలని ఎర్రబెల్లి కోరారు. ఇక్కడ విద్యార్థి దశలోనే స్టూడెంట్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాను అని ఎర్రబెల్లి తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/