వైఎస్‌ఆర్‌సిపిపై దగ్గుబాటి వెంకటేశ్వరావు ఆగ్రహాం

daggubati venkateswara rao
daggubati venkateswara rao

పర్చూరు: ఎన్టీఆర్‌ పెద్దల్లుడు, సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరావు వైఎస్‌ఆర్‌సిపి కి గుబై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చరాన్న ప్రచారం నడుస్తోంది. దగ్గుబాటి వైఎస్‌ఆర్‌సిపిలో ఉండగా..ఆయన భార్య పురందేశ్వరి బిజెపి కొనసాగుతున్నారు. ఇద్దురూ వేర్వేరు పార్టీలో ఉండడం..పురందేశ్వరి వైసిపి ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడాన్ని జగన్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండడం తగదని పురందేశ్వరిని కుడా వైఎస్‌ఆర్‌సిపి లోకి సిఎం జగన్‌ సూచించట్లు సమాచారం. పురందేశ్వరి పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చినట్లు కుడా చెప్పారు. ఈ విషయంలో అధిష్టానం నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అవసరమైనప్పుడు ఆహ్వనించి, అవసరం తీరిన తర్వాత అవమానిస్తారా అంటూ దగ్గుబాటి అనుచరులు వైఎస్‌ఆర్‌సిపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో టిడిపి లో చేరి వైసిపి ఒటమికి పనిచేసిన రామనాథంబాబును పార్టీలోకి తిరిగి తీసుకోవడాన్ని వారు తప్పుబట్టారు. ఈ విషయంలో కూడా అధిష్ఠానం తీరు దగ్గుబాటిని పొమ్మనకుండానే పొగబెట్టే విధంగా ఉందని ఆరోపించారు. మర్టూరు ఏఎంసీ చైర్మెన్‌ జాష్టి వెంకటనారాయణబాబు మాట్లాడుతూ దగ్గుబాటి సైలెంట్‌ అయితే ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ను ప్రోత్సహించి పార్టీ ఇన్‌చార్జిగా నియమించాలని కోరారు. అంతకు ముందు మాట్లడిని కొందరు నాయకులు గొట్టిపాటి భరత్‌ను ఇన్‌చార్జిగా నియమించాలని సూచించగా బాబు మాటలతో సమావేశంలో పాల్గొన్న మరికొందరు నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనితో దగ్గుబాటి వైఎస్‌ఆర్‌సిపి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారంలో ఉన్నది.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/