24న దగ్గుబాటి వారింట్లో మోగనున్న పెళ్లి బాజా

24న దగ్గుబాటి వారింట్లో మోగనున్న పెళ్లి బాజా

విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి రామానాయుడి తనయుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశాడు. అన్న సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కొడుకు రానా చిత్ర రంగ ప్రవేశం చేసి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. ప్రవేశం సులువే అయినా వారి వారి ప్రతిభా పాటవాలతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అటు వెంకటేష్ అయినా ఇటు రానా అయినా.
వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలకు మారు పేరుగా నిలిచినా యాక్షన్ చిత్రాలకు కూడా పెట్టింది పేరు. వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్‌కు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వారిలో ఒక అమ్మాయికి ఈ నెల నవంబర్ 24న వివాహం జరనున్నట్లు సమాచారం. పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి ప్రేమించిన వ్యక్తితోనే జరుగుతోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరగనుంది.
వ్యాపారవేత్త అయిన సురేందర్ రెడ్డి మనవడిని ప్రేమించిన ఆశ్రిత తండ్రికి తన ప్రేమను తెలియజేయగా, పూర్వాపరాలు విచారించి ఓకే చేశారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరువాత కూతురి పెళ్లి పనులలో బిజీగా ఉండనున్నారని తెలుస్తోంది. ఫుడ్ బిజినెస్‌లో ఉన్న ఆశ్రిత ఇప్పటికే హైదరాబాద్‌లో ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది.
24న దగ్గుబాటి వారింట్లో మోగనున్న పెళ్లి బాజా
ReplyForward