మాస్‌రాజాకు వెంకీ మామ వాయిస్.. క్రాక్ ఉంటుందట!

మాస్‌రాజాకు వెంకీ మామ వాయిస్.. క్రాక్ ఉంటుందట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వెంకీ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో క్రాక్ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మె్న్స్ ఇస్తుండగా, అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్, సముథ్రకని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తు్న్నాడు. మరి వెంకటేష్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో తెలియాలంటే క్రాక్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.