భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ‘ఎఫ్ 3’

మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌

A Still From F3 Movie
Venkatesh Movie F3 Movie Release Date

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న   ఎంటర్టైనర్ `ఎఫ్‌3` ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా మే27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా  ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు పాట విడుద‌లై విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు  ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/