తితిదే భోజనం మంచి రుచి, నాణ్యత ఉంది

తిరుపతి: ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి
శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో మధ్యాహ్నం సాధారణ భక్తులతో కలిసి సామూహిక భోజనం చేశారు. అంతకుముందు వెంకయ్య కుటుంబసభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీవారి భక్తులకు తితిదే అందిస్తున్న భోజనం మంచి రుచి, నాణ్యతతో ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడి అధికారులను ప్రశంసించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/