బిజెపి కి భయం పట్టుకుంది – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

బిజెపి కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కేంద్ర వైఫల్యాలను ప్రజలకు కేసీఆర్ బాగా వివరిస్తారని..అందుకే కేసీఆర్ ను తెలంగాణ దాటి వెళ్లొద్దని బిజెపి చూస్తోందని మండిపడ్డారు. అందుకే కేంద్ర మంత్రులు గడికి ఒకరు తెలంగాణ కు వస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడినవి అన్నీ అబద్ధాలేనన్నారు. హరీశ్ రావు ఛాలెంజ్ కు భయపడి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందన్నారు. నిర్మలా హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోయిందన్నారు.

గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ల్లో ఒక్క రూపాయి కేంద్రం సొమ్ము లేదన్నారు. ఫసల్ బీమా యోజన గుజరాత్ లోనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఈరోజు నిర్మలా సీతారామన్ బెదిరింపు ధోరణిలో మాట్లాడిందని.. రేషన్ షాపు లో నరేంద్ర మోదీ ఫోటో లేదని గొడవ పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్ల పన్నులు చెల్లించారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ నిధులను ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు చేస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.