వేలూరు లోక్‌సభ ఎన్నికలు రద్దు

vellore elections 2019
vellore elections 2019


న్యూఢిల్లీ: తమిళనాడులోని వేలూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజకవర్గంలో ఇటీవల భారీగా నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్‌ 14న ఈసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు మంగళవారం, రాష్ట్రపతి అంగీకరించడంతో అక్కడ ఎన్నిక రద్దయింది. కాగా, ఇటీవల వెల్లూరులో ఈసి, ఐటి నిర్వహించిన సోదాల్లో స్థానికి డిఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. అందుకే ఈసి ఈ నిర్ణయం తీసుకుంది. వేలూరు ఎన్నిక రద్దుతో 38 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/