సానుభూతి కోసమే బాబు, పవన్ తాపత్రయపడుతున్నారు – మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సానుభూతి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేసారు వైస్సార్సీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. పవన్‌ లేఖ ఇవ్వడం..చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టడం, అసాంఘిక కార్యక్రమాలు సృష్టించడం అలవాటైపోయిందని వెల్లంపల్లి అన్నారు. నందిగామ లో చంద్రబాబు ఫై వైస్సార్సీపీ శ్రేణులే రాళ్లు విసిరారనే ఆరోపణలను వెల్లంపల్లి ఖండించారు.

చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. వాళ్లపై వాళ్లే రాయి వేయించుకుని సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. పవన్‌ సానుభూతి రాకపోవడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశాడని ఫైర్‌ అయ్యారు. పవన్‌ వీకెండ్‌ పొలిటిషీయన్‌ అని విమర్శించారు. వారంలో రెండు రోజులు ఏపీకి కాల్షీట్లు ఇస్తాడని చెప్పారు. ఇప్పటంపై పవన్‌కు నిజంగా ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ మాకు పోటీనా అని ఎద్దేవా చేశారు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పవన్‌ గురించి ఎవరైనా ఆలోచిస్తారా అని ప్రశ్నించారు.