హైదరాబాద్‌లో రోడ్డెక్కిన వాహనాలు

లాక్‌డౌన్‌ సడలింపుతో వాహనాల రాకపోకలు

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన వాహనాలు
hyderabad-roads

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో నగరలో మళ్లీ కార్యకలపాలు ప్రారంభమయ్యాయి. దీంతో రహదారులపైకి వాహనాల రాకపోకలు పెరిగాయి. లాక్‌డౌన్‌ కారణంగా బోసిపోయిన రోడ్లు తిరిగి వాహన రాకపోకలతో సందడిగా మారాయి. సాధారణ రోజులతో పోలిస్తే 35శాతం వాహనాలు రోడ్లపైకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కాగా హైదరాబాద్‌లో స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్స్, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రిజిస్ట్రేషన్, రవాణాశాఖ కార్యలయాల్లోనూ కార్యకలపాలు కొనసాగుతున్నాయి. ఐటి పరిశ్రమల్లోనూ 33శాతం మంది ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వెసులుబాటు కల్పించిన రంగాలకు చెందిన వాళ్లే బయటకు రావాలని…నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/