కొండెక్కిన ఉల్లి, కూరగాయల ధరలు

మార్కెట్‌ ఉల్లి తో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు వణికిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా ఇప్పడు ఘాటెకింది. రిటైల్‌ మారెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతున్నది. మహారాష్ట్ర మారెట్‌ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు. కొద్ది రోజుల్లో రాబోతున్న బక్రీద్‌ వల్ల వీటికి డిమాండ్‌ పెరిగినట్టు పేర్కొంటున్నారు. గత రెండు వారాలుగా వీటి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఇటీవల వరకు కేంద్రం తీసుకున్న కొన్ని చర్యల కారణంగా ఉల్లిగడ్డల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే వాటిని సడలిస్తుందన్న ఆశతో కొందరు వ్యాపారులు పెద్దయెత్తున స్టాక్‌ను నిలువచేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఎకనమిక్స్‌ టైమ్స్‌ పేర్కొంది.

కూరగాయల ధరలు సైత ఆకాశానికి అంటుకుంటున్నాయి. వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో.. ఆ తేడా కూరగాయల ధరల్లో కనిపిస్తున్నదని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ప్రతి కూరగాయలోనూ 10 రూపాయల పెరుగుదల కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో రాష్ట్రాల నుంచి దిగుబడి తకువగా ఉండటంతో కూడా కూరగాయల ధరలు పెరిగాయని, ట్రాన్స్‌ పోర్ట్‌ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆ భారం కూడా కూరగాయల రేట్లపై పడిందని వెల్లడించారు.