‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన థమన్

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. త్వరలోనే ఫస్ట్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ట్వీట్‌ చేసాడు. ‘అఖండ’ మ్యాజిక్‌ రిపీటవుతుంది అంటూ నెటీజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఈ మూవీలో ఒకటి , రెండు కాదు ఏకంగా 11 యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయని అంటున్నారు. పక్కా బాలయ్య మార్క్ యాక్షన్‌ స్టంట్స్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పించబోతున్నాయట. మామూలుగా బాలయ్య సినిమా అంటే యాక్షన్‌ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అన్న క్లారిటీ రావటంతో వీర సింహారెడ్డి మీద అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మరి ఆ యాక్షన్ సీన్లు ఎలా ఉండబోతాయో చూడాలి.