వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఖరారు

డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ..విజయాలు అందుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తాజాగా గని పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్‌ చాలానే కష్టపడ్డాడు అని అతని ఫిజిక్స్‌ చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొంతసేపటి క్రితమే ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనీ భావించినప్పటికీ , అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల.. సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం.