వరుణ్ సందేశ్ కొత్త చిత్రం టైటిల్ ‘చిత్రం చూడర’

వరుణ్ సందేశ్ మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మైఖేల్‌లో వన్‌ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటించాడు వరుణ్‌ సందేశ్. ఇక ఇప్పుడు చిత్రం చూడర అంటూ మరో మూవీ చేస్తున్నాడు. హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వరుణ్..ఆ తర్వాత ఆ క్రేజ్ ను నిలుపోలేకపోయాడు. కథపై దృష్టి పెట్టకుండా వరుస సినిమాలు ఒప్పుకొని దారుణంగా పడిపోయాడు. గత కొంతకాలంగా సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉన్న వరుణ్..ఇప్పుడిప్పుడే మళ్లీ వరుస ఛాన్సులు రాబట్టుకుంటున్నాడు.

తాజాగా బీఎం సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం చూడర సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబదించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ లుక్ లో వరుణ్ సందేశ్, ధన్ రాజ్ , కాశీ విశ్వనాధ్ ఏదో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం చూపించారు. ఈ మూవీ లో శీతల్ భట్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా , మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ ఐటెం సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్ లో అలరించనున్నారు.